శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:22

45.64% ఇండ్లు ఆన్‌లైన్‌

45.64% ఇండ్లు ఆన్‌లైన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 45.64% ఇండ్లను ఆన్‌లైన్‌ చేయడం పూర్తయ్యింది. మొత్తం 63.28 లక్షల ఇండ్లు ఉండగా, ఆదివారంనాటికి 28.47లక్షల ఇండ్లు టీఎస్‌ ఎన్పీబీ యాప్‌లోకి ఎక్కించారు. ఒక్కరోజే 4,92,052 ఇండ్లను ఆన్‌లైన్‌చేశారు. ప్రతి గ్రామంలో సగటున 39కి పైగా ఇండ్ల వివరాలను నమోదుచేశారు. 12,765 గ్రామాల్లో 16,394 మంది ఈ వివరాలు సేకరిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 11 జిల్లాలు ఇప్పటికే 50శాతానికిపైగా ఇండ్లను ఆన్‌లైన్‌చేసే ప్రక్రియను పూర్తిచేశాయి. వీటిలో 63.94శాతంతో వనపర్తి జిల్లా ముందున్నది. మరో 13 జిల్లాలు 40 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకోగా, 34.20 శాతంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.

వేగంగా ఆస్తుల నమోదు ప్రక్రియ

మలక్‌పేట: ఆస్తుల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సిబ్బందికి సూచించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా నమోదు ప్రక్రియ జరుగాలని చెప్పారు. హైదరాబాద్‌ యాకుత్‌పురా నియోజకవర్గంలోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ లక్ష్మీనగర్‌కాలనీలో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో కలిసి ఆయన ఆదివారం తనిఖీచేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్తుల నమోదులో ఫొటో తీసుకోకుండా వారి పేరు, ఇతర వివరాలు తీసుకోవాలని చెప్పారు.