మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:33:18

ఔటర్‌పై ఫాస్టాగ్‌ తప్పనిసరి కాదు

ఔటర్‌పై ఫాస్టాగ్‌ తప్పనిసరి కాదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుంచి తప్పనిసరిగా అమలయ్యే ఫాస్టాగ్‌ నిబంధనలు హైదరాబాద్‌ ఔటర్‌రింగు రోడ్డుకు వర్తించవని ఔటర్‌ విభాగం అధికారులు తెలిపారు. ఔటర్‌పై ఫాస్టాగ్‌ తప్పనిసరి ఏమీ కాదని స్పష్టంచేశారు. ఔటర్‌పై నిత్యం 1.23 లక్షలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిలో 70 శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ ఉండగా.. 30 శాతం వాహనదారులు దానిని తీసుకోవాల్సి ఉన్నదని వెల్లడించారు. కాగా, జనవరి ఒకటి నుంచి ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకు మాత్రమే టోల్‌ప్లాజాల వద్ద అనుమతి ఉంటుందని నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. మొదట జాతీయ రహదారులపై, తర్వాత రాష్ట్ర రహదారులపై వచ్చే 3-4 నెలల తర్వాత నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసే ఆలోచన ఉన్నది. ఆ తర్వాత దశలో రాష్ట్ర రహదారులు, ఔటర్‌రింగు రోడ్డులలో ఆమలుచేసే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తున్నది


logo