ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 22:25:44

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులకు ధరఖాస్తుల ఆహ్వానం...

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులకు ధరఖాస్తుల ఆహ్వానం...

కాచిగూడ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల ఫ్యాషన్‌ డిజైనింగ్‌ డిగ్రీ, డిప్లొమా కోర్సులకు యువతి,యువకుల నుంచి ధరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌(నిఫ్డ్‌) డైరెక్టర్‌ యు.గీత ఓ ప్రకటనలో తెలిపారు.  బర్కత్‌పుర కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ 2020 బ్యాచ్‌కి 3 సంవత్సరాల బిఎస్సీ డిగ్రీ ఫ్యాషన్‌ టెక్నాలజీ, రెండు సంవత్సరాల ఇంటర్‌ ఫ్యాషన్‌ గర్నమెంట్‌ మేకింగ్‌, సంవత్సరం పాటు డిప్లొమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌, 6 నెలలు, 3నెలలు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులతో పాటు ఫ్యాషన్‌ ఇలిస్ట్రేషన్‌(స్కెచ్చింగ్‌), సర్‌ఫేస్‌ ఆర్నమెంటేషన్‌ (ఎంబ్రాయిడరీ అండ్‌ పెయింటింగ్‌), టెక్స్‌టైల్స్‌ సైన్స్‌(డైనింగ్‌ అండ్‌ ఫెయింటింగ్‌), ఫ్యాట్రన్‌ మేకింగ్‌(ఫ్యాబ్రిక్‌ కటింగ్‌), గార్మెంట్‌ కన్‌స్ట్రక్చన్‌ (టైలరింగ్‌) కోర్సులలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన ఆసక్తిగల విద్యార్థినులు, మహిళలు ఈ నెల 20వ తేదీలోపు ధరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. వివరాలకు 9030610011,9030610022లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.logo