శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 13:06:47

‘కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి’

‘కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి’

యాదాద్రి భువనగిరి జిల్లా :  రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. అడ్డగూడూరు మండల కేంద్రంతోపాటు అజీంపేట గ్రామంలో  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆయిల్‌ ఫెడ్  చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, సింగిల్‌ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు గుండిగ జోసఫ్, రైతుబంధు మండల కన్వీనర్ తీపి రెడ్డి మెగా రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్,  ఎంపీడీఓ చంద్రమౌళి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.