శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 17:55:55

ఈజీఎస్‌ నిధులతో కల్లాల ఫ్లాట్‌ఫారాలు : మంత్రి ఎర్రబెల్లి

ఈజీఎస్‌ నిధులతో కల్లాల ఫ్లాట్‌ఫారాలు : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : రైతులు కల్లాలు చేసుకోవడానికి వీలుగా నిర్మించే ఫ్లాట్‌ ఫారాలకు ప్రత్యేకంగా ఈజీఎస్‌ కింద నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జనగామ జిల్లాలోని కడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో ముస్లింలకు పండుగ వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను మంత్రి నేడు పంపిణీ చేశారు. అదేవిధంగా లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతుల పొలాలు, చేసే సాగుని బట్టి ఫ్లాట్‌ ఫారాలకు నిధులు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఇకపై ఒకే తరహా పంటలు కాకుండా ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు సాగుచేద్దామన్నారు. 


షుగర్‌ ఫ్రీ తెలంగాణ సోనాతో రైతులు బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఏర్పడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలు సాగు చేయొద్దన్నారు. దేశంలో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్‌ ఉందన్నారు. సాగునీటి సమస్యలు తీరుతున్నందున ఇక పత్తి పంటలు వేసి పసిడి రాశులు పొందాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిర్చి, పల్లీకి కూడా మంచి డిమాండ్‌ ఉందన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముస్లింలు, షాదీ ముబారక్‌ లబ్దిదారులు పాల్గొన్నారు.logo