శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:15

రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా

రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా

  • అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

కడెం/దస్తురాబాద్‌/మామడ: రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రైతు బాగుండాలని నమ్మిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెద్ద బెల్లాల్‌తోపాటు మామడలో రైతు వేదిక భవనాల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. దస్తురాబాద్‌ మండలంలోని దేవునిగూడెంలో లక్ష మొక్కల హరిత వనాన్ని బొటానికల్‌ గార్డెన్‌గా మార్చి ‘సీఎం కేసీఆర్‌ హరిత వనం’గా నామకరణం చేస్తామని మంత్రి తెలిపారు. 2015లో తొలి విడత హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నాటిన మొక్కను మంత్రి పరిశీలించారు. కాగా కడెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ వేదికపై కూర్చోగా,  గన్‌మన్‌ చేతిలో నుంచి శానిటైజర్‌ జారి టేబుల్‌పై పడటంతో మంత్రి తలపై, ఎమ్మెల్యే కళ్లలో పడింది. కళ్ల మంటతో ఆమె కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. 

తాజావార్తలు


logo