శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 17:25:27

రైతన్నలు అధైర్యపడొద్దు అండగా ఉంటాం : మంత్రి ఈటల

రైతన్నలు అధైర్యపడొద్దు అండగా ఉంటాం : మంత్రి ఈటల

కరీంనగర్ : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం తన నియోజకవర్గమైన హుజూరాబాద్ పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వర్షాలతో దెబ్బతిన్న వరి వల్ల రైతులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు.

ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దొడ్డు రకం ధాన్యంతో పాటు సన్న రకాలు కూడా కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సన్న రకాలకు మధ్యస్త ధరతో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. 

అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. అనంతరం వీణవంక మండల పర్యటనకు వెళ్లారు.logo