ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 00:36:26

సాగులో మార్పు కోసమే రైతు వేదికలు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సాగులో మార్పు కోసమే రైతు వేదికలు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

నిడమనూరు/త్రిపురారం: రైతుల సంఘటితానికి రైతు వేదికలు కీలకంగా మారనున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా నిడమనూరు, త్రిపురారంలో రైతువేదికల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ఆర్థిక బలోపేతానికి ఉచిత విద్యుత్‌, రైతుబంధు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. పంటల సాగు, పంటల ధర నిర్ణయంలో రైతు భాగస్వామ్యం పెంచాలన్న సంకల్పంతోనే రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు నోముల నర్సింహ్మయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌ పాల్గొన్నారు. logo