బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 15:32:13

నష్ట పరిహారం ఇప్పించాలని మంత్రిని కలిసిన రైతులు

నష్ట పరిహారం ఇప్పించాలని మంత్రిని కలిసిన రైతులు

నిర్మల్ : మొక్క జొన్న విత్తనాలతో నష్టం వాటిళ్లిందని జిల్లాలోని దీలవార్ పూర్ మండలం గుండం పల్లి, టెంబుర్ని, బన్సపల్లి, భాగ్య నగర్ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ క్యాంపు కార్యలయంలో కలిశారు. సీడ్ కంపెనీ వారితో నష్ట పరిహరం చెల్లించే విధంగా చూడాలని వారు మంత్రిని కోరారు. తక్షణమే మంత్రి స్పందించారు. వ్యవసాయ అధికారితో ఫోన్ లో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.


logo