శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:50:11

రైతులను ఆదుకుంటాం

రైతులను ఆదుకుంటాం

  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి భరోసా

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: అకాల వర్షం కారణంగా వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాల్లో పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం తరఫున అదుకుంటామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా కల్పించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవాపురం, ఎర్రకుంట తండా, జింకురాంతండా, ఆరెగూడెం, కొలన్‌పల్లి, కొండూరు, గన్నారం, తిర్మలాయపల్లి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల, జఫర్‌ఘడ్‌ మండలాల్లో వరి, మక్కజొన్న పంటలతోపాటు మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.


logo