మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 15:03:15

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ దయాకర్‌

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ దయాకర్‌

వరంగల్‌ రూరల్‌ : రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు ఎంపీ నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంకి ఫుడ్‌ కోర్టులో పండ్ల మొక్కలను అదేవిధంగా ప్రధాన రహదారికి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.


logo