సోమవారం 01 జూన్ 2020
Telangana - May 08, 2020 , 16:59:57

జూన్ 20 లోపు రైతులు నాట్లు వేసుకోవాలి : మంత్రి అల్లోల

జూన్ 20 లోపు రైతులు నాట్లు వేసుకోవాలి : మంత్రి అల్లోల

నిర్మల్ : రైతులు రోహిణి కార్తి లో తూకాలు పోసి జూన్ 20 లోగా నాట్లు వేస్తే బ్రహ్మాండమైన దిగుబడి వస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని గాజులపేట లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు సకాలంలో తూకాలు పోసి నాట్లు వేస్తే ధాన్యం అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగాయని, సాగుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం రైతుబంధు ద్వారా సాయం అందజేస్తుందన్నారు. రూ 25 వేల లోపు ఉన్న రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేటప్పుడు తాలు లేకుండా జల్లెడ పట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. లాక్ డౌన్ ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.logo