e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి

పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారించాలి

నల్లగొండ : వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ పై రైతులు దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి జి. జగ దీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా గోపాల మిత్రుల పునశ్చరణ తరగతుల సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యంగా జీవించడానికి అమ్మ పాల తర్వాత ఆహారంతో పాటు బర్రె, ఆవు పాలు మనిషికి ఎంతో ఉపయోగమన్నారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయంతో పాటు పశు సంపద వృద్ధి చెందలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం, పాడి, పశు సంపద అభివృద్ధికి చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. అయితే కూరగాయలు, మాంసం ఉత్పత్తులు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -


పాలు, మాంసం ఉత్పత్తులు, కూరగాయలు సాగు పై మన అవసరాల కనుగుణంగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పునరుత్పత్తి యోగ్యమైన పాడి పశువుల సంఖ్య 5,39,406 ఉండగా కృత్రిమ గర్భ ధారణ 3,54,127 నిర్వహించినట్లు తెలిపారు. పాడి, పశు సంపద పెంపొందించాలని, గోపాల మిత్రలు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించటంలో ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు.


పశు గణాభి వృద్ధి సంస్థ చైర్మన్ కోరిన విధంగా గోపాల మిత్రలకు పి.ఆర్.సి వర్తింపు అంశం పై పరిశీలిస్తానని మంత్రి తెలపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డి.సి.సి.బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, పశుగణాభి వృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతె పిచ్చి రెడ్డి, సి.ఈ. ఓ.మంజు వాణి, పశు సంవర్థక శాఖ జె.డి.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..

Suryakumar Yadav: ఇంగ్లండ్ బ‌య‌లుదేరిన సూర్య‌కుమార్ యాద‌వ్‌

రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు

జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత

మహబూబాబాద్‌ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana