గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 14:44:00

భూ సేకరణకు రైతులు సహకరించాలి : మంత్రి హరీశ్‌రావు

భూ సేకరణకు రైతులు సహకరించాలి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: కాళేశ్వరం నీళ్లు వచ్చాక మొదటిసారి పట్టాల పంపిణీ జరగుతుడండం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో సిద్దిపేట రూరల్ మండలం 209 మందికి, సిద్దిపేట అర్బన్ మండలంలోని 305 మందికి పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు పెద్ద మనసుతో  కాలువల భూ సేకరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతోమంది రైతులు సహకరిస్తేనే కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చాయనిభూ సేకరణకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు.

గతంలో పేలిపోయి ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయి మోటర్లు తో పంటలు పండి రైతులు ఖర్చుల పాలు అయ్యేవారని పేర్కొన్నారు. కానీ నేడు టీఆర్ఎస్ పాలనలోనే నిజమైన రైతురాజ్యం వచ్చిందన్నారు. యాసంగి పంట అంటే ఎండ కుండా పండేది కాదు. అలాంటిది యాసంగిలో ఎండకుండా పండింది ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాలన్నారు.


logo