బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 12:15:22

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ధాన్యం అమ్మకాలను చేపట్టాలి

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ధాన్యం అమ్మకాలను చేపట్టాలి

కరోనా మహమ్మారిని అంతం చేసే వరకు ప్రజలు ఐకమత్యాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇది పరీక్షా సమయం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. విదేశాల నుండి వచ్చిన వారు స్వచ్చంధంగా సహకరించాలి. మీ నిర్లక్ష్యంతో తోటివారిని ఆపదలోకి నెట్టవద్దు.  ప్రభుత్వ సూచనలు పాటించి యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతేనే నిబంధనల మేరకు బయటకు రావాలి.   నిత్యావసరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు .. ఏకకాలంలో అందరూ మార్కెట్లకు రావద్దు. ధరల నియంత్రణకు, బ్లాక్ మార్కెట్ నిరోధానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఉన్నతాధికారులతో కమిటీలు వేసింది. ఎవరు అక్రమాలకు పాల్పడినా  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైతులకు ధాన్యం అమ్మకాలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది .. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ధాన్యం అమ్మకాలను చేపట్టాలి.  కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ప్రజలు తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని ప్రదర్శించి ఇతరులకు స్ఫూర్థిగా నిలవాలి. గ్రామాలలో ఎక్కడికక్కడ ప్రజలు స్వీయ నిర్బంధాన్ని ప్రకటిస్తుండడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు అందిస్తున్నారు .. ఇతర నిత్యావసరాలకు లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. 


logo