శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 16:48:46

గాయపడ్డ కొండచిలువకు వైద్యం..!వీడియో

గాయపడ్డ కొండచిలువకు వైద్యం..!వీడియో

హైదరాబాద్‌: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో భారీ కొండ చిలువ ముళ్లపొదల్లో చిక్కుకుంది. బయటకురాలేక విలవిల్లాడుతున్న కొండచిలువను గుర్తించిన రైతులు లక్ష్మన్న, శేఖర్‌, సాగర్‌.. వెంటనే స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకొని 11 ఫీట్ల పొడవు, 26 కిలోల బరువున్న కొండ చిలువను పొలం నుంచి రక్షించి, వైద్యశాలకు తరలించారు. కొండ చిలువకు గాయమైన ప్రదేశంలో ఐదు కుట్లు వేశారు. అనంతరం దానిని నల్లమల అటవీప్రాంతంలో వదిలివేశారు. కాగా, గాయపడ్డ కొండచిలువకు వైద్యం చేయించి మానవత్వం చూపిన రైతులు, స్నేక్‌ సొసైటీ సభ్యులను పలువురు అభినందించారు. కొండచిలువను ఎలా కాపాడారో ఈ కింది వీడియోలో మీరూ చూసేయండి. మరిన్ని ఆసక్తికర నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.