శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 12:35:33

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామలో తొలి రైతు వేదికను సహచర మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌  ఏ సమావేశం అయినా చివరకు కాబినెట్‌లో కూడా ఎజెండా ఏదైనా  వ్యవసాయంపై గంటల తరబడి చర్చ చేపడతారన్నారు.

తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని వివరాలను వెల్లడించారు. కాళేశ్వరం లాగే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఉన్నారు.