శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 04:10:20

వరి నాట్లకు సన్నాహాలు...

వరి నాట్లకు సన్నాహాలు...

నిజామాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో ఏటా వరి నాట్లు ముందుగా బోధన్‌ ప్రాంతంలోనే ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం కోసం వరి నారుమళ్లను బోధన్‌ ప్రాంతంలో రైతులు ఏప్రిల్‌ నెలాఖరు నుంచే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులు జోరుగా పంటలు సాగుచేస్తున్నారు. యాసంగి పంట చేతికి ఇలా వచ్చిందో లేదో.. ఆ వెంటనే రైతులు నారుమళ్లను పోసుకున్నారు. 

బోధన్‌ డివిజన్‌లోని బోధన్‌, రుద్రూర్‌, వర్ని, కోటగిరి, చందూర్‌, మోస్రా మండలాల్లో ఇప్పటికే నారుమళ్లు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారం నుంచి నాట్లు వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కాగా, జిల్లాలోని అనేక మండలాల్లో ఇప్పుడిప్పుడే నారుమళ్లు వేసుకునేందుకు రైతులు జోరుగా వరి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు దొడ్డు రకం వరి వంగడాలకు బదులు, సన్నరకం వరి పంటే వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.


logo