గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 15:13:42

రైతు వేదికలు..ప్రగతికి రహదారులు

రైతు వేదికలు..ప్రగతికి రహదారులు

నారాయణపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేయడం లక్ష్యంగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని. ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దూర్ మండలంలోని లింగాల్ చెడ్ క్లస్టర్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకునేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్న ఏకైక  ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.

డిమాండ్ ఉన్న పంటలను వేసి లాభాలను గడించాలన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలని సచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రైతు వేదిక కార్యక్రమం ద్వారా క్లస్టర్ లోని రైతులందరికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో లక్షా ఇరవై వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువును నింపి సాగునీరు అందిస్తామన్నారు.


logo