మంగళవారం 26 మే 2020
Telangana - May 02, 2020 , 20:24:39

మీరు దేవుళ్ళు సార్.. గిన్నేళ్ల సంది గిట్ల నీళ్లు సూల్లే

మీరు దేవుళ్ళు సార్.. గిన్నేళ్ల సంది గిట్ల నీళ్లు సూల్లే

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందళాపూర్ గ్రామము..  సిద్ధిపేట రూరల్  మండలం పుల్లూరు గ్రామనికి రంగనాయక సాగర్ ద్వారా ప్రధాన ఎడమ కాలువతో గ్రామానికి నీళ్లు చేరడంతో గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపి గుమ్మడికాయ కొట్టి గంగమ్మ తల్లికి  మంత్రి హరీశ్ రావు జల హారతి పట్టారు. తమ గ్రామానికి కాల్వల ద్వారా జలాలు రావడంతో ఉప్పొంగిన ఆనందంతో.. కాల్వల వెంట వస్తున్న జన నాయకుడికి ఘన స్వాగతం పలికి గ్రామస్థులు ఆహ్వానించారు . ఈ సందర్భంగా హరీష్ రావు తో రైతులు గోదావరి జలాలను చూసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.. మంత్రి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. జన నేత..జల నేతకు అడుగడుగున  జన నీరాజనం పలికారు.

చందళాపూర్ గ్రామానికి చెందిన కట్కూరి చంద్రయ్య తో ఆప్యాయంగా మాట్లాడారు..' గిన్నేళ్ల సంది గిట్ల నీళ్లు చూసినవ..  అని వారితో అనగానే '.. సార్ ' ఒకప్పుడు పొలాలకు నీళ్లు కావాలి అంటే మొహాన్ని మొగులుకు పెట్టి చూసేటోళ్లం.. కాలం ఎప్పుడు అవుతాదా.. వర్షం ఎప్పుడు వస్తాదా ఎదురు చూసేటోళ్లం సర్...  'గినీళ్లు వస్తాయి..వస్తాయి అని అన్నారు కానీ వత్తయా...రావా అని చూస్తున్నం సార్.. కానీ వచ్చినక చూస్తే మీరు దేవుళ్ళు అనిపించింది సార్... సార్ మీరు నిజంగా భగవంతునివి సర్...' ఎన్ని జన్మలు ఎత్తిన మీ రుణం తీర్చుకోలేం సర్... అంటూ నవ్వుతూ..దండం పెడుతూ మంత్రికి చెపిన మాటలు.

'చిన్నపటి నుండి గిట్ల నీళ్లు చూస్తావని అనుకున్నవా ......అంటూ మంత్రి అడిగినదానికి ఓ మహిళ మాట్లాడుతూ...' ఇట్లా చూస్తా అనుకోలేదు సారు ఎప్పుడు తెస్తా తెస్తా.....అంటే సారు తెడు మనం సూడం అనుకున్నాము అప్పటిదాకా మనం బతుకుతామ అనుకున్నాం కానీ నీళ్లు వచ్చినయి బతికినం చూసినం'  ఎవ్వరితోని కాలే నీతోనే అయ్యింది సర్' ...  అనగానే ఆ మాటకు అక్కడఉన్న గ్రామస్థులు అంత ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ మంత్రిని అభినందించారు.


logo