కర్షకలోకం హర్షం
_1609180338.jpg)
- రైతుబంధు సాయంపై అన్నదాతల సంబురం
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: యాసంగి సీజన్‌కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడంపై కర్షకలోకం హర్షం వ్యక్తంచేసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఆధ్వర్యంలో రైతులు సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంపీపీ జార మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర, త్రిపురారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రాల్లో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఎస్ఎరజాక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
తాజావార్తలు
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
- బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
- ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి హరీశ్ రావు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి