'రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి'

రంగారెడ్డి : పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే స్థాయికి చేరేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకర్గ అభివృద్ధి పనులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుస్థాయిలో రైతు వేదికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వ్యవసాయరంగం బలోపేతం కోసం నది జలాలు వినియోగిస్తూ అధిక ఉత్పాదకత జరిగేలా కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకమన్నారు. కేవలం ఉత్తరాది రాష్టాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు తెస్తే తెలంగాణ లాంటి రాష్టాలకు నష్టమన్నారు. కేంద్రం తెచ్చిన చట్టంతో రైతుల కన్నా కార్పొరేట్ సంస్థలకే లాభం అన్నారు. లక్షలాది మంది రైతులు చలిలో ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం రైతుల పాక్షిక విజయమన్నారు. తెలంగాణలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడితే, కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక విధానాలు అవలభిస్తుందన్నారు.
తాజావార్తలు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్