ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 13:48:26

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల ఎడ్లబండి ప్రదర్శన

నూతన  రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతుల ఎడ్లబండి ప్రదర్శన

ఖమ్మం : ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ఎడ్లబండి ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో సత్తుపల్లి నియోజకవర్గం లోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు తరలివచ్చి ఎడ్ల బండి ప్రదర్శనలో పాల్గొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ జయహో అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట వీరయ్య మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన రెవెన్యూ చట్టం రాష్ట్రంలో తీసుకురావడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.  సీఎం రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశ పెట్టి రైతుల అభ్యున్నతికి పాటు పడుతున్నారని కొనియాడారు.  కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, పలు మండలాలకు చెందిన రైతులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.      


logo