గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Aug 03, 2020 , 00:11:17

దసరానాటికి రైతువేదికలు

దసరానాటికి రైతువేదికలు

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రఘునాథపాలెం: దసరా నాటికి ఖమ్మం జిల్లాలోని రైతు వేదికలను అందుబాటులోకి తీసుకువస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని అల్లిపురంలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రైతులను సంఘటితం చేసి సమగ్ర పంటల విధానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెళకువలు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. రైతుబంధు కింద ఏటా రూ.14 వేల కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు.  కార్యక్ర మంలో జెడ్పీచైర్మన్‌ కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


logo