ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 01:57:03

రైతు క్షేమానికే మార్కెట్లు మూత

రైతు క్షేమానికే మార్కెట్లు మూత

  • గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దు 
  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో రైతాంగ సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవసాయమార్కెట్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నదని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తెలిపారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని గ్రామాల్లోనే ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్ల ద్వారా సేకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏ విభాగం (ఐకేపీ, పీఏసీఎస్‌, ఇతర సంస్థలు) వారు ధాన్యం సేకరిస్తున్నారో వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారుల  ద్వారా తెలుసుకొని రైతులకు సమాచారం ఇవ్వాలని రైతుబంధు సమితి  సభ్యులకు సూచించారు. 

ఈ మేరకు బుధవారం రైతుబంధు సమితి సభ్యులకు ఆయన లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తున్నదని తెలిపారు. పంటనంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు, వ్యవసాయపనులు చేసేవారు గుంపులుగా  ఉండకుండా చూసుకోవాలన్నారు. వ్యవసాయపనులు మినహా  ఇ తర పనులకు వెళ్లొద్దని  సూచించారు. మూ డువారాలు జాగ్రత్తగా ఉంటూ తోటి రైతులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 


logo