గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 20:46:23

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పువ్వాడ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పువ్వాడ

ఖమ్మం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా వద్ద వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాం నిర్మాణానికి కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. రాష్ర్టాన్ని వ్యవసాయ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల్లో వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. మంచుకొండలో ఇప్పటికే గోదాం నిర్మిచామని, త్వరలోనే మరో పది వేల మెట్రిక్‌ టన్నుల సరుకు నిల్వ ఉంచేందుకు గోదాం నిర్మిస్తామని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసేందుకు దోహదపడుతాయన్నారు.


logo