గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 20:40:50

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జగిత్యాల : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్‌పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు కొనసాగడం లేదని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, అన్నదాతలు దళారులను ఆశ్రయించుకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట జడ్పీ చైర్‌ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  తదితరులున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.