గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 15:24:41

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి : రైతు సంక్షేమ టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు  పల్లా రాజేశ్వర్ రెడ్డి  అన్నారు. జిల్లాలోని భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన  చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేట్ కేట్ చేసి మాట్లాడారు.

 రైతు వేదిక నిర్మాణాలతో రైతులు ఎవుసంలో సమస్యలపై చర్చించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా నియంత్రిత సాగు పద్ధతి అవలంబిస్తే  రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. సీఎం కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo