ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 11:17:59

తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : తెలంగాణలో రైతు సంక్షేమ ప్రభుత్వం పరిపాలిస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాయపర్తి మండలం మైలారం గ్రామ సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే తెలంగాణ పత్తికి నాణ్యతలో ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి చెప్పారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.