శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 14, 2020 , 03:33:48

రైతు ఆత్మహత్యాయత్నం..

రైతు ఆత్మహత్యాయత్నం..

  • భూరికార్డులను మార్చడం లేదంటూ ఆవేదన
  • వెల్దండ తాసిల్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

వెల్దండ: ఓ రైతు పట్టా భూమి.. రికార్డుల్లో మాత్రం అసైన్డ్‌గా నమోదైంది. ఈ పొరపాటును సరిదిద్దాలని సదరు రైతు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పనికాకపోవడంతో సోమవారం వెల్దండ తాసిల్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. వెల్దండ మండల కేంద్రానికి చెందిన బొక్కల లక్ష్మమ్మకు చెందిన పట్టా భూమి ఆన్‌లైన్‌ రికార్డులో సీలింగ్‌ భూమిగా నమోదైంది. 

మళ్లీ పట్టా భూమిగా మార్చాలని రెవెన్యూ అధికారులను ఇటీవల కోరగా సమస్య పరిష్కారం కాలే దు. దీంతో లక్ష్మమ్మ కొడుకు శ్రీను తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవా రం వెల్దండ తాసిల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నర్సింహులు అక్కడికి చేరుకొని శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. 

కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే సమస్య పరిష్కారం

ఈ విషయమై తాసిల్దార్‌ సైదులు స్పందిస్తూ.. లక్ష్మమ్మకు చెందిన భూమి 22ఏ రిజిస్టర్‌ జాబితాలో నమోదైందని, కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే విచారణ జరిపి తిరిగి పట్టా భూమిగా నమోదు చేస్తామన్నారు. ఇదే విషయాన్ని సదరు రైతుకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత ఇలా కొన్ని భూములు ఆన్‌లైన్‌లో పట్టాగా.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీలింగ్‌ భూమిగా కనబడుతున్నదని చెప్పారు. సదరు రైతు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తాసిల్దార్‌ తెలిపారు.


logo