శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 01:28:14

రైతు‘బంధు’లు పేద రైతులే!

రైతు‘బంధు’లు పేద రైతులే!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులే  అధికంగా లబ్ధిపొందుతున్నారు. ఈ వానకాలం సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రైతుబంధు అందజేసింది. వీరిలో సన్నకారు రైతులే (2.47 ఎకరాలలోపు భూమి ఉన్నవారు) 40.46 లక్షల మంది ఉన్నారు. ఇక చిన్నకారు రైతులు (2.48-4.94 ఎకరాలు) 11.33 లక్షల మంది ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో చిన్న, సన్నకారు రైతుల సంఖ్య 51.80 లక్షలు. సాగు పెట్టుబడికోసం అప్పుల పాలవుతున్న పేద రైతులను ఆదుకోవడం కోసమే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుబంధు లబ్ధిదారులను చూస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు తెలుస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ ఉత్పత్తులపై  ప్రణాళికా సంఘం ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ వానకాలం సీజన్‌లో మొత్తం 57.81 లక్షల మంది రైతులకు రూ. 7270.27 కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. 2018 - 2020 వరకు వివిధ కారణాలతో 36,897 మంది రైతులు మరణించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున ప్రభుత్వం మొత్తం రూ. 1844.9 కోట్లను పరిహారంగా అందించింది. 

రైతుబంధు 

లబ్ధిదారులు (లక్షల్లో)

సన్నకారు రైతులు 40.46

చిన్నకారు రైతులు 11.33

బీసీలు                         30.48

ఎస్సీలు                         7.77 

ఎస్టీలు                         7.47 

ఇతరులు                 12.09

మొత్తం                      57.81