శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 12:10:14

సాగు విధానాలపై చర్చించుకునేందుకే రైతు వేదికలు

సాగు విధానాలపై చర్చించుకునేందుకే రైతు వేదికలు

నిర్మల్ : రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, అందుకే  రైతు సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలను అమలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం న్యూ పోచం పహాడ్ లో అక్కపూర్ క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. రైతు వేదికల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రూ.22 లక్షల వ్యయంతో తన సొంత నిధులతో దివంగత అల్లోల చిన్నమ్మ- నారాయణ రెడ్డిల స్మారకార్థం ఈ వేదికను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలని సూచించారు. రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. దీంతో రైతు శిక్షణ కార్యక్రమాలను చెట్ల కింద, పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కష్టాలు తప్పనున్నాయని వెల్లడించారు. రైతు వేదిక కార్యక్రమం ద్వారా క్లస్టర్ లోని రైతులందరికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్ట మొదటి రైతు వేదికను నిర్మల్ లో ప్రారంభించుకున్నామని తెలిపారు. 


logo