బుధవారం 27 మే 2020
Telangana - May 02, 2020 , 20:51:18

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి వద్ద కరీంనగర్‌ -రాయపట్నం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లాల రాంరెడ్డి(70) అనే రైతు ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో ఉన్న తన మామిడి తోటకు టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై వెళుండగా వేగంగా వచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది. ప్రమాదంలో రాంరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన 108లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాంరెడ్డి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 


logo