గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:13

రూ.572 కోట్లతో రైతు వేదికలు

రూ.572 కోట్లతో రైతు వేదికలు

ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి: రైతు వేదికలు రైతుల పాలిట దేవాలయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం చెగ్యాం, కొత్తపేటలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి రైతువేదికల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జగదేవ్‌పేట, తాళ్లకొత్తపేట గ్రామాల్లో రూ.2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.572 కోట్లు వెచ్చించి 2,600 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. 


logo