సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 14:03:46

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు

యాదాద్రి భువనగిరి : రైతులను సంఘటితం చేయడం కోసమే రైతు వేదికల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని  విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించే అన్నదాతలు పంటల సాగుపై చర్చించేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు.

రైతు సంక్షేమాన్ని కోరే సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం ప్రతి నిత్యం పాటు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,  ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎంపీపీ ఉమాదేవి జడ్పీటీసీ భానుమతి, సర్పంచ్ శ్రీహరి పాల్గొన్నారు. logo