ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 14:04:47

సమస్యలపై చర్చించేందుకే రైతు వేదికలు

సమస్యలపై చర్చించేందుకే రైతు వేదికలు

సిద్దిపేట : జిల్లాలోని మద్దూరు మండలంలోని దూళ్మిట్టలో రైతు వేదిక నిర్మాణ పనులకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ..రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదికలు ప్రభ్రుత్వం నిర్మిస్తుందన్నారు. సాగులో సాధకబాధలు చర్చించుకోవడానికి ఈ వేదికలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.logo