శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 17:33:24

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

మేడ్చల్‌ మల్కాజిగిరి : దేశంలోనే రైతుల కోసం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల పరిధిలోని యాద్గార్‌పల్లి, కీసరలో నిర్మించిన రైతు వేదికలను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రైతులను ధనికులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.  రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిర్మిస్తున్న రైతు వేదికలు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తాయన్నారు.

జిల్లాలో మొత్తం తొమ్మిది రైతు వేదికలకు భూమి పూజ చేశామని, ఇప్పటికి మూడింటిని ప్రారంభించుకున్నామన్నాని తెలిపారు. రైతు వేదికల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.680 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. వ్యవసాయరంగంలో ఎలాంటి పంటలు పండించాలో రైతులకు ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.