గురువారం 09 జూలై 2020
Telangana - Apr 18, 2020 , 20:38:41

పిడుగు పడి రైతుతో పాటు కాడెడ్లు మృతి

పిడుగు పడి రైతుతో పాటు కాడెడ్లు మృతి

వికారాబాద్‌: జిల్లాలోని పెద్దమూల్‌ మండల పరిధిలోని బాయిమీది తండా సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి రైతు రాంచందర్‌(50)తో పాటు రెండు కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించిన పోలీసులు రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రాంచందర్‌కు రైతుబంధు ఉందని, దానితో పాటు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 


logo