మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 18:00:36

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

కామారెడ్డి: జిల్లాలోని బిక్కునూరు మండలం అనంతపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామాని చెందిన రైతు చిట్టేడి లింగారెడ్డి(50) కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. బిక్కునూర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం లింగారెడ్డి తన వ్యవసాయ బావి వద్ద పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లాడు. గడ్డి కోస్తుండగా బోరు బావికి సరఫర అయ్యే విద్యుత్‌ వైరు కొడవలికి తగిలి వైర్‌ కట్‌ అయింది. దీంతో లింగారెడ్డికి కరెంట్‌ షాక్‌ తగిలి పడిపోయాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల రైతులు కరెంట్‌ సరఫరా నిలిపివేసి చూసేలోగా లింగారెడ్డి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి తరలించారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.


logo