శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 08:36:43

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి

నల్లగొండ: జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బక్కయ్య(50) అనే రైతు నిన్న సాయంత్రం గడ్డి కోయడానికి పొలానికి వెళ్లాడు. ఈ రోజు ఉదయం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా కరెంట్‌ షాక్‌తో బక్కయ్య మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ అధికారులు విచారణ చేపట్టారు. 


logo