గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:42:56

రైతువేదికలు సీఎం మానసపుత్రికలు

రైతువేదికలు సీఎం మానసపుత్రికలు

  • మంత్రి సత్యవతిరాథోడ్‌

కురవి: రైతు వేదికలు సీఎం కేసీఆర్‌ మానస పుత్రికలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ పేర్కొన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్‌ స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో రైతువేదిక నిర్మాణానికి తన భర్త గోవింద్‌ రాథోడ్‌ స్మారకార్థం రూ.13 లక్షలను అందించనున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టర్‌ పీవీ గౌతమ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందుతో కలిసి రైతువేదిక నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ దసరా నాటికి రైతు వేదిక నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.  


logo