మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:09:45

ప్రముఖ గైనకాలజిస్ట్‌ పద్మ కన్నుమూత

ప్రముఖ గైనకాలజిస్ట్‌ పద్మ కన్నుమూత

సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాకతీయ మెడికల్‌ కళాశాల రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ టీ పద్మ (97) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలను బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటికలో నిర్వహించారు. డాక్టర్‌ పద్మ మరణంపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె దాదాపు లక్షమందికి పురుడుపోశారు.


logo