శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 16:54:52

భర్తను హతమార్చిన భార్య

భర్తను హతమార్చిన భార్య

సంగారెడ్డి : కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతలచేరు గ్రామంలో శుక్రవారం జరగ్గా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. హత్నూర మండలం చింతలచేరు గ్రామానికి చెందిన దంపతులు నర్సింహులు (50)కు భార్య నీలమ్మకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పంచాయతీ పెట్టినా భార్య ప్రవర్తనలో మార్పురాలేదు. శుక్రవారం సైతం దంపతుల మధ్య గొడవ జరగడంతో నీలమ్మ భర్త తలపై రోకలితో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతురాలి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలు వివాహం చేసుకొని అత్తారింట్లో ఉంటుండగా కుమారులు రాత్రి ఇంట్లో లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo