బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 15:25:29

న్యాయ కమిషన్‌ను ఆశ్రయించిన ‘దిశ’ నిందితుల కుటుంబాలు

న్యాయ కమిషన్‌ను ఆశ్రయించిన ‘దిశ’ నిందితుల కుటుంబాలు

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ లైంగిక దాడి, హత్య ఘటన కేసులోని నిందితుల కుటుంబాలు సోమవారం న్యాయ కమిషన్‌ ఆశ్రయించాయి. ‘దిశ’ సంఘటన నేపథ్యంలో ‘దిశ ఎన్‌కౌంటర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలంటూ శివ, నవీన్‌, చెన్నకేశవులు, ఆరిఫ్‌ కుటుంబ సభ్యులు కమిషన్‌ను కోరారు. చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా చూపిస్తున్నారంటూ కుటుంబీకులు అభ్యంతరం తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై సినిమా తీయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దిశ చిత్రాన్ని ఆపాలని ఇప్పటికే హైకోర్టును కోరిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అలాగే దర్శక నిర్మాత రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట కూడా ఆందోళన నిర్వహించారు. లైంగిక దాడి, హత్య కేసు ఆధారంగా రాంగోపాల్‌ వర్మ పర్యవేక్షణలో ‘దిశ ఎన్‌కౌంటర్‌’ చిత్రానికి ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిశ’ లైంగిక దాడి ఘ‌ట‌న నేప‌థ్యం, నిందితుల‌ను పోలీసులు ఎలా ప‌ట్టుకున్నారు..? ఎలా ఎన్ కౌంట‌ర్ చేశారు..? ఈ ఘ‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఎలాంటి ఆందోళ‌నలు జ‌రిగాయ‌నే విష‌యాల‌ను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ( చూడండి : పుట్టగొడుగులతో ఎన్ని లాభాలో తెలుసా?.. వీడియో )

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.