మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 07:02:10

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఏడాది జైలు

 కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఏడాది జైలు

హైదరాబాద్‌:  కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు. ఈ సెక్షన్‌ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

నగరంలో కరోనా కట్టడికి సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మార్చి 31వ తేదీ వరకు రద్దీగా ఉండే సినిమా హాళ్లు, స్కూళ్లు, జూపార్కు మూసివేయనున్నారు. అలాగే శిల్పారామం, క్లబ్బులు, లామకాన్‌ కేంద్రం వంటివి సైతం మూసివేస్తున్నారు. కాగా, ఆర్టీసీ బస్సులు,  షాపింగ్‌ మాల్స్‌, మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 


logo