సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 21:24:24

కరోనాపై తప్పుడు పోస్ట్‌లు.. కౌన్సిలర్‌ అరెస్ట్‌

కరోనాపై తప్పుడు పోస్ట్‌లు.. కౌన్సిలర్‌ అరెస్ట్‌

కోరుట్ల ‌: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 22వ వార్డు  కౌన్సిలర్‌ మాడవేణి నరేశ్‌ను కోరుట్ల పోలీసులు  అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నరేశ్‌ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌ గ్రూపుల్లో కరోనాపై అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ, మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా కరోనా వైరస్‌పై తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నాడని తెలిపారు. తప్పుడు ప్రచారాల ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.  


logo