e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News ‘డయల్‌ 100కు ఆకతాయిల బెడద

‘డయల్‌ 100కు ఆకతాయిల బెడద

  • బాంబు పెట్టారని ఒకడు.. గొడవలని మరొకడు
  • రోజులో మొత్తం కాల్స్‌లో 10 శాతం ఇలాంటివే
  • సిబ్బందికి తలనొప్పిగా మారిన తప్పుడు కాల్స్‌

రాత్రి 11 గంటలు.. డయల్‌ 100కు ఓ వ్యక్తి కాల్‌ చేసి ‘దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టారు’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. క్షణాల్లో అప్రమత్తమైన సిబ్బంది, స్థానిక పోలీసులను అలర్ట్‌ చేశారు. ఎంత వెదికినా ఎక్కడా జాడ లేదు. మరోసారి అదే తరహాలో ఫోన్‌కాల్‌.. అలా ఏకంగా 70 సార్లు కాల్‌ చేశాడు ఓ తాగుబోతు.తెల్లవారుజామున ఓ వ్యక్తి డయల్‌ 100కు కాల్‌చేసి ‘మద్యం తాగడానికి నా భార్య డబ్బులు ఇవ్వడం లేదు. తిడుతున్నది. పోలీసులను పంపండి’ అని కోరాడు.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసుల సాయం కోరేందుకు ఏర్పాటుచేసిన ‘డయల్‌ 100’ ఎంతోమందిని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతున్నది. సామాన్యులకు ఎంతో ముఖ్యమైన వారధిగా మారిన డయల్‌ 100కు ఈ మధ్య ఆకతాయిల బెడద తీవ్రమవుతున్నది. తాగుబోతులు, చిల్లరగా తిరిగే ఆవారాగాళ్లు ఈ నంబర్‌కు తరుచూ ఫోన్‌చేసి బాంబులు పెట్టారనో, గొడవలు జరుగుతున్నాయనో తప్పుడు సమాచారం ఇచ్చి విసిగిస్తున్నారు. ఈ నంబర్‌కు వచ్చే కాల్స్‌పై నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులకు తప్పుడు కాల్స్‌ పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా డయల్‌ 100కు రోజుకు 4 వేలవరకు ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిల్లో దాదాపు పదిశాతం తప్పుడు ఫోన్‌కాల్స్‌ ఉంటున్నాయి. ఇలా తరచూ తప్పుడు సమాచారం ఇచ్చే నంబర్లను గుర్తించి న్యూసెన్స్‌ కాల్స్‌ జాబితాలో జత చేస్తున్నారు. శృతిమించి ప్రవర్తించేవారికి పోలీసులు వారి ైస్టెల్‌లోనే బుద్ధిచెప్తున్నారు.

- Advertisement -

ఫోన్‌కాల్‌ ఏదైనా రెస్పాన్స్‌ సేమ్‌
ఫోన్‌చేసే వ్యక్తి ఆకతాయితనంగా చేసినా డయల్‌ 100 సిబ్బంది వాటిని నిర్లక్ష్యం చేయరు. కాల్‌ వచ్చిన 35 సెకన్ల నుంచి మూడు నిమిషాల లోపు సదరు సమాచారం ఏ ఏరియా నుంచి వచ్చిందో ఆ ఏరియా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు, దగ్గరలోని బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌కార్‌ సిబ్బందికి వాయిస్‌కాల్‌, లొకేషన్‌తో సహా షేర్‌ చేస్తున్నారు. అలా సమాచారం అందిన మూడు నిమిషాల్లోనే క్షేత్రస్థాయిలో సిబ్బంది స్పాట్‌కు రీచ్‌ అవుతున్నారు. జిల్లాల్లో పది నిమిషాలు రెస్పాన్స్‌టైంగా నమోదవుతున్నది. ఆలోపు పోలీస్‌ సిబ్బంది స్పాట్‌కు చేరుకొని చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఫీడ్‌బ్యాక్‌ను టీఎస్‌కాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement