ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:09:34

జహీరాబాద్‌లో నకిలీ సోయా విత్తనాలు సీజ్‌

జహీరాబాద్‌లో నకిలీ సోయా విత్తనాలు సీజ్‌

జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని సుభాష్‌గంజ్‌లో విత్తన దుకాణాల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. పది క్వింటాళ్ల నకిలీ సోయా విత్తనాలను సీజ్‌ చేశారు. అక్రమంగా సోయా, కంది విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదుచేశారు. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు దుకాణాలపై దాడులుచేసినట్టు అధికారులు తెలిపారు. దాడుల్లో తాసిల్దార్‌ పీ నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ అధికారి ప్రవీణ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్సై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పట్టణ ఎస్సై వెంకటేశ్‌ పాల్గొన్నారు.logo