గురువారం 02 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 18:22:47

నకిలీ విత్తనాల తయారీదారులు నలుగురు అరెస్టు

నకిలీ విత్తనాల తయారీదారులు నలుగురు అరెస్టు

మహబూబాబాద్‌ : నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పరారీకాగా డీసీఎం, ప్యాకింగ్‌ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

విత్తనాల విక్రయ దుకాణాల్లో సోదాలు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారంలోని విత్తనాల దుకాణాల్లో అధికారులు నేడు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా లైసెన్స్‌ లేకుండా మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాలను అధికారులు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు.


logo