హైదరాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 రోగులకు వైద్యం అందించడంలో అత్యంత కీలకంగా మారిన రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు మెడికల్ మాఫియా నకిలీ అవతారం ఎత్తింది. అసలైన ఇంజక్షన్లు ఇవే అనేలా నకిలీలను తయారుచేస్తున్నారు. కొద్దిపాటిజాగ్రత్తలతో నకిలీవి, అసలైనవి గుర్తించవచ్చు.
ఒరిజినల్ దానిలో రెమ్డెసివిర్ అని రాసినచోట పైన ఆర్ఎక్స్ అని ఉంటుంది. నకిలీలో ఇది ఉండదు.
ఇంజక్షన్ పేరులో 100 mg/Vial అన్న చోట వీ క్యాపిటల్ లెటర్ ఉంటుంది. నకిలీదాంట్లో చిన్నది ఉంటుంది. మరో మూ డుచోట్ల క్యాపిటల్ లెటర్ బదులు స్మాల్ లెటర్స్ ఉంటాయి.
డబ్బా వెనుక భాగంలో వార్నింగ్ అన్నది అసలైనదైతే ఎరుపు రంగులో, నకిలీదాంట్లో నలుపు రంగు అక్షరాల్లో ఉంటుంది
తెలంగాణ స్టేట్ అన్నది నకిలీలో అక్షర దోషాలతో ఉంటుంది.